Skip to main content

Aradhya Dhaivama

ఆరాధ్య దైవమా - నా సర్వమా 
ఆ మహిమ వీడినా - నా దరికి చేరినా
ఇదే వందనం - ఇదే వందనం 

1. తగనివాడనైన నా అతిథివైతివి
    కలువరిలో నీ ప్రేమ కరుగబోసితికి
    నా విమోచకా నా సహాయకుడు
    నా హృదయసీమనేలే యేసు నాయక
    ఇదే వందనం - ఇదే వందనం 

2. దిక్కులేని నన్ను హక్కుదారుగా చేసితివి
    మక్కువతో నా దోష శిక్ష  బాపితివి
   నా ప్రాణనాథుడా నా ప్రేమపాత్రుడా
   నా దివ్య సేవ చేయ ధన్యమాయనే
   ఇదే వందనం - ఇదే వందనం