Skip to main content

Posts

Showing posts from September, 2022

vetagaani urilo nundi

వేటగాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకు ఆశ్రయమిచ్చావు (2)

లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)

రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||

వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||

మానవుల కాపాడుటకు
నీ దూతలను ఏర్పరచావు
రాయి తగులకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||

keerthi hallelujah

కీర్తి హల్లెలూయా
గానం యేసు నామం మధురమిదే
నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2)

స్తుతి స్తుతి శ్రీ యేసు నామం 
స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం
ఈ గానము శ్రీ యేసుకే
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం
స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం
ఈ స్తోత్రము మా క్రీస్తుకే

ప్రయాసే లేదుగా – యేసే తోడుగా
మాతో నడువగా – భయమే లేదుగా

క్రీస్తుని వేడగా – మార్గం తానేగా
సత్యం రూఢిగా – జీవం నీయగా 

Thana rakthamu tho

 Verse 1: 

ThanaRakthamu Tho Kadigi, Nee Aathma tho Nimpavu

Verse

Verse : 2nd repeat

ThanaRakthamu Tho Kadigi, Nee Aathma tho Nimpavu

ThanaRakthamu tho Kadigi, Nee Aathma tho Nimpavu

Chorus : 

Hossanna, Naa Yesu Raja. Hallelujah, Naa Jeevana Dhatha.

Hossanna, Naa Yesu Raja. Hallelujah, Naa Jeevana Dhatha.

Hossanna, Naa Yesu Raja. Hallelujah, Naa Jeevana Dhatha.

Bridge:

Siluvapaii Vreladithivaa, Nee Kaluvari prema chupinchithivi

Siluvapaii Vreladithivaa, Naa papamunantha chupinchitivi

Siluvapaii Veladithivaa, Naa papamunantha Kadigithivi

Siluvapaii Veladithivaa, Nee Kaluvari prema chupinchithive

Chorus : 

Hossanna, Naa Yesu Raja. 

Hallelujah, Naa Jeevana Dhatha.


Hossanna, Naa Yesu Raja. 

Hallelujah, Naa Jeevana Dhatha

Ni padalu Tadapakunda

ప్రార్ధన వలనే పయనము 
ప్రార్ధనే  ప్రాకారము 
ప్రార్ధనే  ప్రాధాన్యము 
ప్రార్ధన  లేనిదే పరాజయం 

ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా 
ప్రార్ధించకుండా నే  ఉండలేనయ్యా 
నీ పాదాలు తడపకుండా 
నా పయనం సాగదయ్యా 

1.ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము 
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట  అసాద్యము 
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట  అసాద్యము 
ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము 

2.ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము 
ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము 
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము 
ప్రార్ధనలో  పెనుగులాడితే పడిపోవుట అసాద్యము 

Na sarvam Na kota

నా సర్వం నా కోట
నా దుర్గం నీవే నీవే
ఆశ్రయము నా బలము
నా ఊపిరి నీవే నీవే

బాధలలో నన్నాదరించి – నాకాశ్రయమైనావు
శోధనలో నన్నాదుకొని – నా తల పైకెత్తావు
నిను నేను విడువను దేవా – నా జీవిత కాలమంతా
నా భారమంతా నీపై వేసి – నే నడిచెదను దేవా
నే నడిచెదను – నే నడిచెదను – నే నడిచెదను దేవా (2)    ||బాధలలో||

Anni Sadhyame yesulo

నన్ను బలపరచు యేసునందే నేను
సర్వము చేయగలను
నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను
సమస్తం చేయగలను
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే యేసులో
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే క్రీస్తులో        ||నన్ను బలపరచు||

నీటిని చీల్చి - బాటను వేసి - నరులను నడిపించెనే
బండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనే
నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే
నీటిపై నడిచెనే - నీటినే అణచెనే
నా కన్నీటిని నాట్యముగ మార్చెనే
జీవ జలమైన నా యేసయ్యా...         ||సాధ్యము||

హోరేబు కొండపై - మండే పొద నుండి - మోషేతో మాట్లాడెనే
బలిపీఠముపై - అగ్నిని కురిపించి - మహిమను కనుపరచెనే
షద్రకు మేషాకు అబేద్నెగోలను
అగ్నిలో ఉండియే కాపాడెనే
నరకపు మంటనుండి నను రక్షించిన
అగ్ని నేత్రాల నా యేసయ్యా...         ||సాధ్యము||

Yudhdhamu Yehovaade

యుద్ధము యెహోవాదే (4)

రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు (2)
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ           ||యుద్ధము||

వ్యాధులు మనలను పడద్రోసినా
బాధలు మనలను కృంగదీసినా (2)
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండ           ||యుద్ధము||

ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా (2)
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా           ||యుద్ధము||

అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా (2)
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ           ||యుద్ధము||

Blessed assurance

Blessed assurance, Jesus is mine!
Oh, what a foretaste of glory divine!
Heir of salvation, purchase of God
Born of his Spirit, washed in His blood

This is my story, this is my song
Praising my Savior all the day long
This is my story, this is my song
Praising my Savior all the day long

Perfect submission, perfect delight
Visions of rapture now burst on my sight
Angels descending bring from above
Echoes of mercy, whispers of love

This is my story, this is my song
Praising my Savior all the day long
This is my story, this is my song
Praising my Savior all the day long
Praising my Savior all the day long

Devudu Maa Pakshamuna Undaga

దేవుడు మా పక్షమున ఉండగా
మాకు విరోధి ఎవడు
మా  దేవుడు మా పక్షమున ఉండగా
మాకు విరోధి ఎవడు
జీవముగల దేవుని సైన్యముగా
సాతాను నోడింతుము

యుద్ధం యెహోవాదే
రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే
ఘనత యెహోవాదే

మా దేవుని బాహువే
తన దక్షిణ హస్తమే
ఆయన ముఖ కాంతియే
మాకు జయమిచ్చును
తనదగు ప్రజగా మము రూపించి
నిరతము మాపై కృప చూపించి
తన మహిమకై మము పంపించి
ప్రభావమును కనపరుచును

మా దేవుని ఎరిగిన
జనులముగా మేమందరం
బలముతొ ఘనకార్యముల్ 
చేసి చూపింతుము
దేవునిచే సూర క్రియలను చేసి
భూమిని తలక్రిందులుగా చేసి
యన నామము పైకెత్తి
ప్రభు ధ్వజము స్థాపింతుము

Mahima

దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భజియించి పూజించి ఆరాధింప
నీకే నీకే మహిమ (2)
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
మహిమా నీకే మహిమా – (4)          ||దేవా||

కష్టాలలోన నష్టాలలోన
కన్నీరు తుడిచింది నీవే కదా (2)
నా జీవితాంతం నీ నామ స్మరణే
చేసేద నా యేసయ్యా (2)        ||మహిమా||

నా కొండ నీవే నా కోట నీవే
నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2)
నిన్నే భజించి నిన్నే స్తుతించి
ఆరాధింతునయా (2)        ||మహిమా||

sannuthinthu yesu swami

 సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2)
శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు
ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను           ||సన్నుతింతు||

సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2)
నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును            ||సన్నుతింతును||

మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును
శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును (2)
అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును
యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము           ||సన్నుతింతును||

SAMARPINCHEDHANU

 సమర్పించెదను సమస్తము
సన్నుతించెదను సతతము
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును,
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును

1. శ్రేష్టమైనవి కలిగించెను నష్టము
లోకజ్ఞానము ఆయెను వెర్రితనము
ధనము దరిచేర్చెను నాశనము
పరపతి చూపించెను దుష్టత్వము

2. నిలుపుకొనెదను నీ మాదిరి వినయము
చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు
అర్పించెదను నా ప్రాణము 
ఇదియే ఆరాధనా బలిపీఠము