Skip to main content

SS hym's & praise's 21st jan 2024

ఊహించలేని మేలులతో నింపిన

ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2)       
||ఊహించలేని||

మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2)     
||ఊహించలేని||

నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2)   
||ఊహించలేని||2

యేసే నా ఆశ్రయమ

యేసే నా ఆశ్రయము
యేసే నా ఆధారము
నా కోట నీవే… నా దుర్గము నీవే
నా కాపరి నీవే (2)

శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా
కష్టాల ఊభిలో కూరుకున్ననూ (2)
నన్ను లేవనెత్తును నన్ను బలపరచును
నాకు శక్తినిచ్చి నడిపించును (2)      
||యేసే నా||

జీవ నావలో తుఫాను చెలరేగినా
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)
నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును
చుక్కాని అయి దారిచుపును (2)      
||యేసే నా||

దినమంతయు చీకటి అలుముకున్ననూ
బ్రతుకే భారమైన సంద్రమైననూ (2)
నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును
నా నావలో నాతో నుండును (2)         
||యేసే నా||

మేలు చేయక నీవు ఉండలేవయ్

మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. 
యేసయ్యా..యేసయ్యా (2) 
||మేలు చేయక||

నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2)
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది 
||యేసయ్యా||

ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2)
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి 
||యేసయ్యా||

పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు 
||యేసయ్యా||

నాదంటూ లోకాన ఏదీ లేదయ్

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2)
నీదే నీదే బ్రతుకంతా నీదే (2) 
||నాదంటూ||

నాకు ఉన్న సామర్ధ్యం
నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం
నాకు ఉన్న సంతానం (2)
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2)
కేవలం నీదేనయ్య (2) 
||నాదంటూ||

నాకు ఉన్న ఈ బలం
నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం
నిలువ నీడ ఈ గృహం (2)
నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2)
కేవలం నీదేనయ్య (2) 
||నాదంటూ||

worship

ఎందుకో నన్నింతగా నీవు
 ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర 
హల్లెలూయ యేసయ్యా (2)

నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే (2)         
||ఎందుకో||

నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే (2)        
||ఎందుకో||

యేసయ్యా.. యేసయ్యా.. 
యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2)        

Holy communion

శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా .... ఆ ... నాలోనా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -2

నీ వాత్సల్యం నీ బాహుళ్యం 
నీ కృప కనికరము చూపించుము -2
పాపము చేశాను - దోషినై యున్నాను -2
తెలిసి యున్నది నా అతిక్రమమే
తెలిసి యున్నవి నా పాపములే -2
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా -2

||శుద్ధ హృదయం కలుగజేయుము||

నీ జ్ఞానమును నీ సత్యమును
నా ఆంతర్యములో పుట్టించుము -2
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం -2
కలుగజేయుము నా హృదయములో -4
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా .... ఆ ... నాలోనా -2

||శుద్ధ హృదయం కలుగజేయుము||

offerings

బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా (2)
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా (2)
నా యేసయ్యా.. నా యేసయ్యా…

పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా (2)
నా యేసయ్యా.. నా యేసయ్యా…

రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా (2)
నా సర్వం యేసయ్య - నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య - నా ధ్యానం యేసయ్య

కొత్త పాట-New song

దేవుని ఆనందం నిను కమ్మును
ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్- 2
పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను
ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు -2

నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క 
ఫలమును పొందెదవు -2
కోల్పోయినవన్ని రెండింతలుగా 
మరలా పొందెదవు -2

బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్
నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్ -2
నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్
అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్ - 2

నీతి సూర్యుడు నీ పైన ఉదయించును
యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు -2
నీ కాలి క్రింద దుష్టుడు  ధూళిగా మారును 
నింగిలో మెరుపు వలె శత్రువు కూలును - 2