Skip to main content

Sunday Service hym's & praise's 29th sep 2024

నడిపించు నా నావా

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప      
 ||నడిపించు||

నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము        
||నడిపించు||

రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ         
 ||నడిపించు||

ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు             
 ||నడిపించు||

ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట       
||నడిపించు||

క్రీస్తే సర్వాధికారి

క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి      
 ||క్రీస్తే||

ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత
భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన      
 ||క్రీస్తే||

శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి
శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన      
 ||క్రీస్తే||

పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన       
||క్రీస్తే||

ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన       
||క్రీస్తే||

రండి ఉత్సాహించి పాడుదమ

రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే (2)

రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధికేగుదము (2)
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోష గానము చేయుదము            
 ||రండి||

మన ప్రభువే మహా దేవుండు
ఘన మహాత్యము గల రాజు (2)
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరములాయనవే                 
||రండి||

సముద్రము సృష్టించెనాయనదే
సత్యుని హస్తమే భువిజేసెన్ (2)
ఆయన దైవము పాలితుల
ఆయన మేపెడి గొర్రెలము                    
||రండి||

ఆ ప్రభు సన్నిధి మోకరించి
ఆయన ముందర మ్రొక్కుదము (2)
ఆయన మాటలు గైకొనిన
అయ్యవి మనకెంతో మేలగును              
||రండి||

స్తోత్రం చెల్లింతుము

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి          
||స్తోత్రం||

దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2)       
||స్తోత్రం||

గాడాంధకారములో కన్నీటి లోయలలో (2)
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2)      
||స్తోత్రం||

సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2)      
||స్తోత్రం||

సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2)
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2)     
||స్తోత్రం||

సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)       
||స్తోత్రం||

పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2)     
 ||స్తోత్రం||

అయ్యా వందనాల

అయ్యా వందనాలు 
అయ్యా వందనాలు 
అయ్యా వందనాలు నీకే... ||2||

మృతతుల్యమైన -శారా గర్భమును 
జీవింపచేసిన నీకే...
నీరీక్షణే లేని -నా జీవితానికి 
ఆధారమైన నీకే ||2||
ఆగిపోవచ్చయ్యా జీవితం 
ఎన్నో... దినములు 
అయినా నీవిస్తవయ్య 
వాగ్దానా..... ఫలములు ||2||
|| అయ్యా....||

అవమానమేదురైనా -అబ్రహాము బ్రతుకులో
ఆనందమిచ్చిన నీకే... 
నమ్మదగిన దేవుడని -నీ వైపు చూచుటకు 
నిరీక్షణనిచ్చిన నీకే.. ||2|| 
కోల్పో లేదయ్య జీవితం
నిన్నే....చూడగా 
జరిగిస్తవయ్య కార్యములు 
ఆశ్చర్య...రీతిగా ||2||
||అయ్యా.....||

అపరాధిని యేసయ్

అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)

సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)

ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)
---------------------------------------------------------------
నశించుటకు ఎందరో వేచియున్నను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మధ్యలో నే నడచినను
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడా నా యజమానుడా…
నన్ను పిలచిన యజమానుడా
యజమానుడా నా యజమానుడా…
నన్ను నడిపించే యజమానుడా

నీ పిలుపు వలన నేను నశించి పోలేదు-నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను-నీ ప్రేమకు సాటి లేదు

offerings praise

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు యేసే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

భూమిని పుట్టించకమునుపు-లోకము పునాది లేనపుడు   
 ||దేవుడు||
తండ్రి కుమార ఆత్మయు-ఒకడైయున్న రూపము        
||దేవుడు||

సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో (2)          
 ||మహిమా||
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
రానైయున్నవాడా (2)

మహిమా మహిమా ఆ యేసుకే
మహిమా మహిమా మన యేసుకే (2)    
||హల్లెలూయ||

నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా (2)

లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)-కఠినులు రాళ్ళతో హింసించినా (2)
స్తెఫను వలె సాగెదా            ||నే సాగెద||
బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)-క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)
పౌలు వలె సాగెదా             ||నే సాగెద||

ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్ర పోడ

ఇశ్రాయేలును .. ఇశ్రాయేలును.. 
ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్ర పోడు 
మమ్ము కాపాడిన మా దేవా - ఇదియే మా జీహ్వార్పణ (2)


ఎందుకింత ప్రేమ నా పై చుపావు యేసయ్యా 
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా (2)

చరణం 1:
గోతిలోనికి దిగిన... మన్ను నిన్ను స్తుతించునా 
గలమెత్తి పాడగలనా .. మృతుల లోకాన ?
సజీవులు సజీవులే నిన్ను-స్తుతియించెదరు (2)
ఈ కంఠము మూగ బోక మునుపే- నిన్ను ఆరధించెద (2) 

చరణం 2:
నిరీక్షణ లేక ... కలవరము చెందగా .. 
అడుగులు తడబడగా .. ఆప్తులే దూరమైనా 
వాత్సల్య కటాక్షములు - ఎంతో ఉన్నతమై (2)
గొప్ప కార్యములు- నా యెడల చేసి యున్నావు (2)
" ఎందుకింత "

చరణం 3: 
ఇన్నాల్లకైన …..ఫలములు కాయకున్న 
నాకైనీవిచ్చిన ……వనరులే వ్యర్థమైన 
ఈ సంత్సరము కూడా -ఉండనిమ్మని (2)
విజ్ఞాపనమును చేయుచున్న -ప్రధాన యాజక 
" ఎందుకింత "

నీతో నేను నడువాలని

ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2)    

నడవలేక నేను ఈ లోక యాత్రలో
బహు బలహీనుడనైతినయ్యా (2)
నా చేయి పట్టి నీతో నన్ను
నడిపించుమయ్యా నా యేసయ్యా (2)
నీతో నడువాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య      

సౌలును పౌలుగా
మార్చిన నా గొప్ప దేవుడా (2)
నీలో ప్రేమా నాలో నింపి
నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా ఉండాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య        


నీ దయలో నీ కృపలో

నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
నీ ఆత్మతో నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా
దేవా… దేవా…

కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా
ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు
నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2)
ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా
నీవె నా మార్గము – నీవె నా జీవము
నీవె నా గమ్యము – నీవె నా సర్వము
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా 

ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2)
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2)
నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం
నీవె నా తోడుగా – నీవె నా నీడగా
ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా