Skip to main content

Mahimaku Pathruda

మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2)

మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు (2)

స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2) 

అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించి మేము మహిమ పరచెదం (2)