Skip to main content

Mahonathuda ni nidalo

మహోన్నతుడా - నీ నీడలొ నేను నివసింతును సర్వశక్తుడా - నీ చాటున నేను విశ్రమింతును యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నను కప్పుము నీవే నా శైలము నా కేడెము నేను నమ్మదగిన దైవం 1.ప్రపంచమును- నీ వాక్కువలన నిర్మించితివి నీవు సృజించిన వాటిని - నీవే కాపాడువాడవు వేటకాని ఊరినుండి - విడిపించువాడవు నీవే నాశనకరమైన తెగులునుండి - తప్పించువాడవు నీవే నా రక్షణ శృంగమా - నా ఆశ్రయదుర్గమా 2.యేసుని తట్టు - నా కన్నులెత్తుచున్నాను నీ వలననే నిత్యము - సహాయం కలుగుచున్నది ఏ అపాయము రాకుండా - నా కుడి ప్రక్కన నిలువుము నా ప్రాణము నిరంతరం- కాపాడువాడవు నీవే నా రక్షణ శృంగమా - నా ఆశ్రయ దుర్గమా