Skip to main content

Yesu Raju Ga Vachuchunadu

యేసు రాజుగా వచ్చు చున్నాడు – భూలోక మంతా తెలుసుకొంటారు
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు – రారాజుగా వచ్చు చున్నాడు
యేసు రారాజుగా వచ్చుచున్నాడు

  1. మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు – పరిశుద్దులందరిని తీసుకు పోతాడు
    లోకమంతా శ్రమకాలం -విడువబడుట బహుఘోరం ” యేసు”
  2. ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది-ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది
    ఈ సువార్త మూయబడున్‌ – వాక్యమే కరువగును ” యేసు”
  3. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును – ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును
    నీతి శాంతి వర్ధిల్లును న్యాయమే కనబడును
  4. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర-సాగిలపడి నమస్కరించి గడగడలాడును
    వంగనీ మోకాళ్ళన్నీ యేసయ్యా యెదుట వంగిపోవును ” యేసు”
  5. క్రైస్తవుడా మరువ వద్దు ఆయన రాకడ-కనిపెట్టి ప్రార్ధనచేయి సిద్ధముగానుండు
    రెప్ప పాటున మారాలి యేసయ్యా చెంతకు చేరాలి ” యేసు