కుమ్మరి ఓ కుమ్మరి-
జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక -
చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
పనికిరాని పాత్రనని –
పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా –
నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ –
శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి –
సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి
||కుమ్మరి||
విలువలేని పాత్రను నేను –
కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో –
వెలుగొందు పాత్రగజేసి (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను –
ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను –
సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా
||కుమ్మరి||
లోకాశతో నిండి ఉప్పొంగుచూ –
మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే –
మనశ్శాంతి కోల్పోతిని (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు –
పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే –
నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్
||కుమ్మరి||