Skip to main content

orrana orrana

ఓరన్న…  ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా    ||ఓరన్న||

చరిత్రలోనికి వచ్చాడన్నా 
పవిత్ర జీవం తెచ్చాడన్నా  (2)
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును (2)              ||ఓరన్న||

పరమును విడచి వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా (2)
పరిశుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)             ||ఓరన్న||

సిలువలో ప్రాణం పెట్టాడన్నా 
మరణం గెలిచి లేచాడన్న  (2)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును (2)     ||ఓరన్న||