Skip to main content

aradhana aradhana


ఆరాధన ఆరాధన - యేసుప్రభునకే స్తుతి అర్పణ
ఆరాధన ఆరాధన - క్రీస్తేసునకే హృది అర్పణ

1.పరిశుద్ధ దైవమా - ప్రక్షాళన చేయుమా 
సర్వోన్నత దైవమా - జీవాత్మతో నింపుమా  
రక్షణ భాగ్యమిచ్చిన - గొఱ్ఱెపిల్లయైన క్రీస్తూ
సింహాసనాసీనుడా - స్తుతియు ఘనత నీకే కలుగును 
ఆరాధింతును నిన్నే యేసు - ఆరాధింతును నిన్నే 
2.తేజ స్వరూపా - నీ మహిమతో నింపుమా
ప్రేమ స్వరూపా - నీ ప్రేమతో నింపుమా
పవిత్రుడా నీ క్రియలు గొప్పవి - సర్వాధికారి నీవేప 
యుగాలకు రాజువైతివి - శక్తి బలము నీకే కలుగును