Skip to main content

ascharyamina prema

ఆశ్చర్యమైన ప్రేమ
కల్వరిలోని ప్రేమ
మరణము కంటె 
బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ (2) 

పరమును వీడిన ప్రేమ
ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి 
సేదదీర్చి నిత్య జీవమిచ్చే  

పావన యేసుని ప్రేమ సిలువలో 
పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి
 జయమిచ్చి తన మహిమ నిచ్చే  

శ్రమలు సహించిన ప్రేమ
నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది 
ఎన్నడూ యెడబాయదు    

నా స్థితి జూచిన ప్రేమ
నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి 
ముద్దాడి కన్నీటిని తుడిచే