బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా (2) మనుషులను చేసాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా (2) నా యేసయ్యా.. నా యేసయ్యా… నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం|| పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా (2) కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా (2) ||నా యేసయ్యా|| రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యమొందాడయ్యా (2) కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా (2) ||నా యేసయ్యా|| నా సర్వం యేసయ్య - నా జీవం యేసయ్య నా ప్రాణం యేసయ్య - నా ధ్యానం యేసయ్య