Skip to main content

Nuthanamainadhi

నూతనమైనది నీ వాత్సల్యము.. 
ప్రతి దినము నన్ను దర్శించేను
ఏడాబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు ||2|| 
సన్నుతించెదను నా యేసయ్య సన్నుతించెదను నీ నామమును||2|| 

గడచిన కాలమంత
నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత
నీ కృపలోన నన్ను దాచేదవు ||2|| 
విడువని దేవుడవు
యెడబాయలేదు  నన్ను క్షణమైనా త్రోసివేయవు ||2|| 
||సన్నుతించెదను|| 

నా హీనదశలో నీప్రేమచూపి  పైకిలేపినావు
ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు |2| 
మరువని దేవుడవు నన్ను మరువలేదు
నీవు ఏ సమయమందైనను చేయి విడువవు ||2||
     ||సన్నుతించెద||

నీ  రెక్కలక్రింద నన్ను దాచినావు
ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా
నీవుండినావు  సంరక్షించావు||2|| 
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు||2||    ||సన్నుతించెదను||