Skip to main content

prema prema

 ప్రేమా ప్రేమా 
ప్రేమా ప్రియుడవు నీవే
ఆనంద మానందమే
ఆనంద మానందమే

నీ ప్రేమ రుచియించిన నాడే
నన్ను నేను మరచితినయ్యా
నీ ప్రేమధికమయ్యా నాపై 
నీ ప్రేమధికమయ్యా

పరలోక ప్రశస్త రాజా
ప్రేమతో నేతెంచినావా 
ప్రేమ తెలియగలనా నీ ప్రేమ
లోతు నెరుగగలనా

ద్రోహిని ఎన్నాళ్ళో నిన్ను
గాంచక తిరిగితినయ్యా 
ప్రేమతో నా ప్రియుడా నన్ను
కౌగలించితివే

ఇహలోక సకల మహిమ
పువ్వులవలె వాడిపోవున్
వాడదే అయ్యా నీ ప్రేమ
వాడిపోదయ్యా

నీ ప్రేమ మాధుర్యమును
వివరింప తరమౌనే నాకు 
అతి సులభముగానే పరమున
వివరించగలను