Skip to main content

krupalanu thalan chu

కృపలను తలంచుచు 
ఆయుష్కాలమంతా 
ప్రభుని కృతజ్ఞతతో 
స్తుతింతున్

మిమ్మును ముట్టినవాడు 
నా కంటిపాపను ||2||
ముట్టుననీ 
సెలవిచ్చిన దేవుడు
కాచెను గతకాలం (నన్ను) 
||కృప||

రూపింపబడుచున్న యే 
ఆయుధముండినను ||2||
నాకు విరోధమై 
వర్ధిల్లదుయని
చెప్పిన మాట సత్యం (ప్రభువు) 
||కృప||

కన్నీటి లోయలలో 
నే కృంగిన వేళలలో ||2||
నింగిని చీల్చి 
వర్షము పంపి 
నింపెను నా హృదయం (యేసు) 
||కృప||

సర్వోన్నతుడైన నా 
దేవునితో చేరి ||2||
సతతము తన కృప 
వెల్లడి చేయ 
స్తుతులతొ నింపెను (ఇలలో) 
||కృప||

హల్లెలూయా ఆమేన్ హ 
నాకెంతో ఆనందమే ||2||
సియోన్ నివాసము 
నాకెంతో ఆనందం 
ఆనంద మానందమే (ఆమేన్) 
||కృప||