ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా (2)
ఘోరపాపినైన నేనూ
దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా (2)
నాకున్న వారందరూ
నను విడచిపోయిననూ (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా (2)
నీవు లేకుండ నేనూ
ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా (2)