ఓ క్రైస్తవుడా - సైనికుడా - బలవంతుడా - పరిశుద్ధుడా
కదలిరావోయ్ - నీవు కదలిరా
జాలరి మనుష్యుల పట్టు జాలరీ ... ఆత్మల కాయు కాపరీ
అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి
కదలిరావోయ్ - నీవు కదలిరా
జాలరి మనుష్యుల పట్టు జాలరీ ... ఆత్మల కాయు కాపరీ
అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి
1.
సిలువే నీ స్థావరము - శ్రమలే నీ సైన్యము
సహనమే నీ ధైర్యము - సాక్ష్యమే నీ సైన్యము
2.
త్యాగమే నీ క్షేమము - ప్రార్థనే నీ యవ్వనము
వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము
3.
వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము
3.
సత్యమే నీ గమ్యము - సమర్పనయే నీ శీలము
యేసే నీ కార్యక్రమము - ప్రేమే నీ పరాక్రమము4.
దేశంలో విదేశం లో - గ్రామంలో కుగ్రామంలో
అడవులలో కొండలలో - పనిఎంతో ఫలమెంతో
అడవులలో కొండలలో - పనిఎంతో ఫలమెంతో
5.
జయించి లే శరీరాన్ని - ధరించుకో శిరస్త్రాన్ని
బంధించు విషపు సర్పాన్ని - బోధించు యేసు పథకాన్ని
బంధించు విషపు సర్పాన్ని - బోధించు యేసు పథకాన్ని
6.
సిద్ధాంతపు గట్టు దుమికిరా - సాకులనే మెట్టులు దిగిరా
దీనుడా కాదు ధన్యుడా - విదేయుడా అజేయుడా
దీనుడా కాదు ధన్యుడా - విదేయుడా అజేయుడా
7.
వాగ్దాన భూమి స్వతంత్రించుకో
అధ్వాన్నపు అడవి దాటి ముందుకు పో
నీ ఇల్లే పెనూయేలు - నీ పేరే ఇశ్రాయేలు
8.
సంఘమే నీ రంగ స్థలం - సహవాసమే నీ స్థానము
ఏసే నీ నాయకుడు - శుద్దాత్ముడే దర్శకుడు
ఏసే నీ నాయకుడు - శుద్దాత్ముడే దర్శకుడు