Skip to main content

Prema Yesuni Prema

ప్రేమ యేసుని ప్రేమ
అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము
ఇది భువి అందించలేనిది

ఎన్నడెన్నడు మారనిది
నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది
నా యేసుని నిత్య ప్రేమ             ||ప్రేమ||

తల్లిదండ్రుల ప్రేమ
నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ
కలలా కరిగిపోవును 

భార్యా భర్తల మధ్య
వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును
త్వరలో మోడులా మిగిలిపోవును 

బంధుమిత్రులయందు
వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే
వెలుగునిచ్చి ఆరిపోవును 

ధరలోన ప్రేమలన్నియు
స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా
కడవరకు ఆదరించును