Skip to main content

Aparaadhini Yesayya

అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)

సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)

ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)

ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)

దాహంబు గొనగా చేదు 
చిరకను ద్రావినిడితి(2)
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను(2)

ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని(2)
క్క్రూరుండనై గొట్టితిని
ఘోరంపి పాపిని దేవా (2)