Skip to main content

Shudda Hrudayam

శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా …. ఆ … నాలోనా -2

శుద్ధ హృదయం కలుగజేయుము -2
1. నీ వాత్సల్యం నీ బాహుళ్యం

 నీ కృప కనికరము చూపించుము -2
పాపము చేశాను – దోషినై యున్నాను -2 


తెలిసి యున్నది నా అతిక్రమమే 

తెలిసి యున్నవి నా పాపములే -2
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా -2 

శుద్ధ హృదయం కలుగజేయుము -2

2. నీ జ్ఞానమును నీ సత్యమును
నా ఆంతర్యములో పుట్టించుము -2
ఉత్సాహ సంతోషం -నీ రక్షణానందం -2
కలుగజేయుము నా- హృదయములో -4
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా …. ఆ … నాలోనా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -4