Skip to main content

Yesu Rakthame Jayamu

 యేసు రక్తమే జయము జయమురా
సిలువ రక్తమే జయము జయమురా
ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా
తన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2)              

verse1

బలహీనులకు బలమైన దుర్గము
ముక్తి యేసు రక్తము
వ్యాధి బాధలకు విడుదల కలిగించును
స్వస్థత యేసు రక్తము (2)
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం
నీతికి కవచం పరిశుద్ధుని రక్తం (2)
మృత్యువునే గెలుచు రక్తము
పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధించిన
జయశీలి అధిపతి రారాజు యేసయ్యే                 

verse2

పాపికి శరణం యేసు రక్తము
రక్షణ ప్రాకారము
అపవిత్రాత్మను పారద్రోలును
 ఖడ్గము యేసు రక్తము (2)
శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు?
ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు (2)
సాతాన్నే నలగ్గొట్టిన
వాడి తలనే చితగ్గొట్టిన
కొదమ సింహమై మేఘారూఢిగా
తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే