Skip to main content

Posts

Showing posts from April, 2021

Jaya Jaya Yesu

జయ జయ యేసు – జయ యేసు

జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)
జయ జయ రాజా – జయ రాజా (2)
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం    || జయ జయ ||

మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2)
పరమ బలమొసగు జయ యేసు (2)
శరణము నీవే జయ యేసు      || జయ జయ ||

సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2)
సమరము గెల్చిన జయ యేసు (2)
అమరముర్తివి జయ యేసు       || జయ జయ ||

సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2)
పాతవి గతియించె జయ యేసు (2)
దాతవు నీవే జయ యేసు       || జయ జయ ||

బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2)
బండలు తీయుము జయ యేసు (2)
అండకు చేర్చుము జయ యేసు        || జయ జయ ||

ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2)
ముద్రలు తీయుము జయ యేసు (2)
ముద్రించుము నను జయ యేసు     || జయ జయ ||

కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు (2)
సేవలో బలము జయ యేసు (2)
జీవము నీవే జయ యేసు        || జయ జయ ||

దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2)
కయ్యము గెల్చిన జయ యేసు (2)
అయ్యా నీవే జయ యేసు       || జయ జయ ||

Lechinadura Samadhi Gelchinaadura

లేచినాడురా సమాధి గెలిచినాడురా 
యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా

అ.ప. లేతునని తా జెప్పినట్టు 
లేఖనములలో పలికినట్టు /లేచి/

1. భద్రముగ సమాధిపైని – పెద్దరాతిని యుంచిరి భటులు 
ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న 

2. ప్రభువు దూత పరమునుండి – త్వరగా దిగి రాతిని పొర్లించి 
భళిర దానిపై కూర్చుండె – భయమునొంద కావలివారు 

3. పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు 
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు – రుద్దుదామని వచ్చి చూడ 

4. చూడవెళ్లిన స్త్రీలను దూత – చూచి యపుడే వారితోడ 
లేడు గలలియ ముందుగ పోతున్నాడు – అపుడె లేచినాడని 

5. చచ్చిపోయి లేచినాడు – స్వామి భక్తుల కగుపడినాడు 
చచ్చినను నను లేపుతాడు – చావు అంటే భయపడరాదు 

6. నేను చేసే పనులనెరుగు – నేను నడిచే మార్గమెరుగు 
నేను చేప్పు మాటలెరుగు – నేను బ్రతికే బ్రతుకు నెరుగు 

7. నేను లేచిన యేసునందు – మానక మది నమ్ముకొందు – తాను 
నాలోయుండినందున – దయను జేర్చు మోక్షమందు 

8. పాపభారము లేదు మనకు – మరణ భయము లేదు మనకు 
నరక బాధ లేదు మనకు – మరువకండి యేసు ప్రభుని 


9. యేసు నందే రక్షణ భాగ్యం – యేసు నందే నిత్య జీవం 
యేసు నందే ఆత్మ శాంతి – యేసు నందే మోక్ష భాగ్యం 

10. పాపులకై వచ్చినాడు – పాపులను కరుణించాడు 
పాపులను ప్రేమించానాడు – ప్రాణదానము చేసినాడు 

Geetham Geetham

గీతం గీతం జయ జయ గీతం

చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము (2)       || గీతం||

చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు           || గీతం||

వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి          || గీతం||

అన్న కయప వారల సభయు
అదరుచు పరుగిడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి             || గీతం||

గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా
మీ మేళతాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి          || గీతం||