నీ కంటి పాపవలె నన్ను కాచుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా ఘోరపాపినైన నన్ను మన్నించుటకు నేను అర్హుడనా నేను అర్హుడనా వేదనను భరియించి అవమానం సహియించి నా కొరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా1.
నన్ను పరమున చేర్చుటకు - నీవే నా దరి చేరితివి
నాకు విడుదల నిచ్చుటకు - నా దోషములను మోసితివి
నా శాపము తొలగించుటకు - నీవే పాపముగా మారి
నన్ను శుద్ధుని చేయుటకు - నీ రక్తము చిందించితివి
నాలో ఊపిరి నిలుపుటకు - నీ తుది శ్వాస వీడితివి
ఇంత ప్రేమ చూపుటకు - నే అర్హుడనా
నాలో ఊపిరి నిలుపుటకు - నీ తుది శ్వాస వీడితివి
ఇంత ప్రేమ చూపుటకు - నే అర్హుడనా
నీ కంటి పాపవలె నన్ను కాచుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
ఘోరపాపినైన నన్ను మన్నించుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
2.
అల్పుడను నను కరుణించి - రక్షణ కవచము నాకిచ్చి
యోగ్యుడవంటు నను పిలచి - నీ వారసునిగా చేసితివి
అర్పింతును యేసు నీకే - సర్వ ఘనత ప్రభావములు
నా జీవిత పరియంతము - నీ దాసుడనై బ్రతికెదను
నీ చరణములను హత్తుకుని - అద్దరి చేరుకుందునయా
నీ మహిమా కాంతులలో - నివసింతునయా
నీ చరణములను హత్తుకుని - అద్దరి చేరుకుందునయా
నీ మహిమా కాంతులలో - నివసింతునయా