దాత్రుత్వమును గలిగి పెరుగుదమ = ధనము – ధాత్రి దేవుని దంచు నెఱుగుదమ
1. శక్తికొలది కాన్కలర్పింతమ = మన – భుక్తినుండి కొంత దీయుదమ
2.సంతోషముగ నియ్య సాగుదమ = మన – స్సంతటితో జేయ నేగుదమ
3.గర్వఘనములు వీడి యర్పింతమ = యుర్వి – సర్వ మాయనదంచు నేర్పింతమ
4.సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ = క్రీస్తు – సంఘ యక్కఱ
లన్ని తీర్చుదమ
5.ప్రతియాదివార మిది మది నుంతమ = దీని ప్రతి సంఘస్థుడు చేయ బోధింతమ
6.విధి దలచి దుర్బలుల రక్షింతమ = సంఘ – విధవాళి దానముతో దర్శింతము
7.దిక్కులేని జనుల దీవింతమ = వారి – యక్కఱలలో మేలు గావింతమ
8. పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ = మఱల – నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ
9.వెదజల్లి యభివృద్ది పొందుదమ = మోక్ష – పదవు లను భవింప బరుగిడుదమ
10.వర్ధిల్లిన కొలది చెల్లింతము = లోక – వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ