నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడెలనా…
వేలాది పోట్టేల్లనా (2)
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా (2)
మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా (2)
విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను (2)
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును (2)
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా (2)