Skip to main content

neethi gala yehova

నీతిగల యెహోవ స్తుతి మీ
యాత్మతో నర్పించుడి
మీ యాత్మతో సేవించుడి
దాతయౌ మన క్రీస్తు నీతిని
దాల్చుకొని సేవించుడి || నీతి ||
1.    
చదలఁ బుడమియు
రవియు జలధియు
నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవ నామము
సర్వదా నుతిఁజేయను || నీతి ||
2.    
సర్వశక్తుని కార్యములకీ
సర్వ రాష్ట్రము లన్నియు
గర్వములు విడి తలలు వంచుచు
నుర్విలో నుతిఁజేయను || నీతి ||
3.
గీత తాండవ వాద్యములచేఁ
బ్రీతిపరచెడు సేవతో
పాతకంబులు పరిహరించెడు
దాతనే సేవించుఁడి || నీతి ||
4.
పరమదూతలు నరులు పుడమిని
మొరలు బెట్టుచు దేవుని
పరము నందున్నట్టి యేసుని
పాదములు సేవింతురు || నీతి ||
5. 
ఇలను భక్తులు గూడుకొనియా
బలము గల్గిన దేవుని
వెలయు స్తుతి వే నోళ్లతోడను
విసుగు జెందక జేయుడి || నీతి ||
6.
ఆత్మ నీవిఁక మేలుకొని శు
ద్దాత్మఁ యేసుని దండ్రిని
త్రిత్వమగునా యేక దేవుని
హర్షమున సేవింపవే || నీతి ||