Skip to main content

Posts

Showing posts from December, 2021

vandanam yessaya

 నా ప్రతి అవసరము
తీర్చువాడవు నీవే… యేసయ్యా
నా ప్రతి ఆశ
నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా

ఆకలితో నే అలమటించినప్పుడు
అక్కరనెరిగి ఆదుకొన్నావు (2)

వందనం యేసయ్యా
నీకే వందనం యేసయ్యా
నా ప్రతి అవసరము
తీర్చువాడవు నీవే… యేసయ్యా
నా ప్రతి ఆశ
నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా

ఊహించలేని ఆశ్చర్య కార్యములతో
ఏ కొదువ లేక నను కాచుచుంటివి (2)
కష్టాలెన్ని వచ్చినా – కరువులెన్ని కలిగినా
నీ చేతి నీడ ఎప్పుడూ నను దాటిపోదు             ||వందనం||

తప్పిపోయినా త్రోవ మరచినా
నీ కృప నన్ను విడచి వెళ్ళదు (2)
నీ కృప – విడచి వెళ్ళదు నన్నెప్పుడు (2)
యేసయ్యా..

నా ప్రతి విన్నపం
నీ చెంత చేరునేసయ్యా – యేసయ్యా
నా ప్రతి ప్రార్థనకు
జవాబు నీవే యేసయ్యా – యేసయ్యా (2)

వందనం యేసయ్యా
నీకే వందనం యేసయ్యా

ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై
యేసయ్యా… వందనం

నన్ను గన్నయ్య రావె నా యేసు

నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా        ||నన్ను||

ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను (2)
పొందికగా జేయరావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ       ||నన్ను||

హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి (2)
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి       ||నన్ను||

కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను (2)
ఈ లోకమాయ సుఖేచ్ఛలు
చాలును జాలును జాలు నోతండ్రి       ||నన్ను||

దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను (2)
కారణ గురువు లింకెవ్వరు
లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి       ||నన్ను||

నా వంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని (2)
దీవించి రక్షింపనిప్పుడే
రావయ్య రావయ్య రావయ్య తండ్రి       ||నన్ను||

ఆలయంలో ప్రవేశించండి అందరు

 ఆలయంలో ప్రవేశించండి అందరు
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం        ||ఆలయంలో||


ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరెదం పొందెదం
ఆనందమానందం హల్లెలూయా          ||ఆలయంలో||

Lekkinchaleni Sthothramul

లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై                 ||లెక్కించలేని||

ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును (2)
భూమిలో కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్             ||లెక్కించలేని|| 

అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిపైనున్నవన్ని (2)
దేవా నిన్నే పొగడును                ||లెక్కించలేని|| 

నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశమున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్            ||లెక్కించలేని||

పరిశుద్ధ పరిశుద్ధ

పల్లవి: పరిశుద్ధ పరిశుద్ధ -పరిశుద్ధ ప్రభువా
వరదూతలైన నిన్ - వర్ణింప గలరా                          ..పరిశుద్ధ..

1.        పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ
నిరుపమ బలబుద్ధి -నీతి ప్రభావా                          ..పరిశుద్ధ..

2.        పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ =
నరులను రక్షించు = కరుణా నముద్రా                     ..పరిశుద్ధ..

3.        పరిశుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ =
పరమానంద ప్రేమ = భక్తుల కిడుమా                      ..పరిశుద్ధ..

4.        జనకకుమారాత్మ = లను నేక దేవ =
ఘనమహిమచెల్లును = దనర నిత్యముగా              ..పరిశుద్ధ..

sree yesundu janminche reyilo

శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)
నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)           ||శ్రీ యేసుండు||

ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)
ఇమ్మానుయేలనెడి నామమందున (2)        ||శ్రీ యేసుండు||

సత్రమందున పశువులశాల యందున (2)
దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2)  ||శ్రీ యేసుండు||

పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2)             ||శ్రీ యేసుండు||

గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2)               ||శ్రీ యేసుండు||

మన కొరకొక్క శిశువు పుట్టెను (2)
ధరను మన దోషములబోగొట్టెను (2)            ||శ్రీ యేసుండు||

పరలోకపు సైన్యంబు గూడెను (2)
మింట వర రక్షకుని గూర్చి పాడెను (2)         ||శ్రీ యేసుండు||

అక్షయుండగు యేసు పుట్టెను (2)
మనకు రక్షణంబు సిద్ధపరచెను (2)              ||శ్రీ యేసుండు||

Dhivine Vidachina Raaraju

దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య
ఆ దివికే నిన్ను నన్ను చేర్చగా జన్మించాడయ్యా "2" తూర్పు దిక్కు చుక్క మెరిసే లే చిన్నారి ఏసు జాడ తెలిపెలే బెత్లహేము సంతోషించే లే రక్షకుండు యిల జన్మించే లే బంగారు సామ్రాణి భోలంబు తెచ్చా మే మనసారా బాల ఏసు ని సుత్తి ఇంప వచ్చామే ఊరంతా సంబర మాయే లే రండి రండి పోదాము రారాజు ని చూద్దాము రండి రండి పోదాము తరి ఇద్దాము "2"

దివినుండి దూతలు వచ్చి భయపడవద్ద అన్నారే ఈ భూవికి కలుగబోవు శుభవార్తను తెలిపారే అది విన్న గొల్లలు పరుగున ఏసయ్యను చేరారే పాటలతో నాట్యం తో ప్రభువుని కీర్తించారే రక్షకుడు ఏసయ్యే రారాజు గా వచ్చాడే చిన్న పెద్ద అంతా కలిసి పూజిద్దాం రారండోయ్ "2" రండి రండి.....

చిరునవ్వుల చిన్ని యేసు చిత్రంగా భువి చేరెలే పశువుల పాకే నేడు పరలోక సన్నిదాయే దినుడిగా ఉదయించాడే మహిమత్వం విడిచాడే తన ప్రేమను మనకై చూప దయతో దిగి వచ్చాడే పరమే విడిచి నీకై నాకై నరుని గ వచ్చాడే చీకు చింతలు పాపం పోవును పూజిద్దాం రారండోయ్ "2" రండి రండి పోదాము రారాజు......

thandri deva

తండ్రి దేవా తండ్రి దేవా

నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు ll 2 ll

నా ప్రియుడా నా ప్రాణమా
నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా
నిన్ ఆరాధించెదన్ ll 2 ll

నీ ప్రేమ వర్ణించుట
నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట
నా బ్రతుకు చాలదయ్యా ll 2 ll
తండ్రి దేవా నా ఆనందమా
నీ వడిలో నాకు సుఖము ll 2 ll

నా ప్రాణ స్నేహితుడా
నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా
నీ ప్రేమ మధురమాయ్యా ll 2 ll
తండ్రి దేవా నా ఆనందమా
నీ వడిలో నాకు సుఖము ll 2 ll