Skip to main content

Posts

Showing posts from January, 2022

Yesu Devuni Aradhikulam

యేసు దేవుని ఆరాధికులం 
వెనుక చూడని సైనికులం (2)
మరణమైన, శ్రమ ఎదురైన, 
బెదిరిపోని విశ్వాసులం (2)
మా యేసుడే మా బలం 
మా యేసుడే మా జయం (2)
ప్రాణమిచ్చి, మృతిని గెల్చిన, 
యేసురాజే మా అతిశయం (2)

షద్రకు మేషాకు అబెద్నగోలను
అగ్నిగుండంలో త్రోయబోగా  2
నెబుకద్నెజరుమాకు చింతియే లేదులే
మా దేవుడు మమ్మును రక్షించులే (2)
అని తెగించి, విశ్వసించి, ముగ్గురు నలుగురై జయించిరే (2)

శత్రుసైన్యము దండెత్తి వచ్చెగా
యెహొషాపాతు ప్రార్ధిన చేసెగా (2)
యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా 
భయమె లేక వారు జయగీతం పాడగా (2)
ఆత్మతోడ, స్తుతియిస్తుండ, దేవుడె యుద్ధం జరిగించెగా (గెలిపించెగా) (2)

శత్రు గొల్యతు సవాలు విసిరెగా 
దేవుని ప్రజలంతా మౌనమాయెగా (2)
ఒక్క దావీదు రోషముతో లేచెగా 
జీవము గల దేవుని నమాన్ని చాటెగా (2)
చిన్న రాయి, వడిసె తోడ, ఆత్మశక్తితో జయించెగా (2)

Devaa Naa Hrudayamutho

దేవా నా హృదయముతో

నిన్నే నేను కీర్తింతును (2)
మారని ప్రేమ నీదే (2)
నిన్ను కీర్తింతును ఓ.. ఓ..
నిన్ను కొనియాడెద        ||దేవా||

ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా
నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2)
నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన
నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన      ||మారని||

నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా
పరలోక రాజ్యములో పరవశించాలని (2)
నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ (2)     ||మారని||

Aradhana yesu neke

ఆరాధన యేసు నీకే ........ (4) నీ చిత్తము నే చేసెద - నీ బాటలో నడిచేదా నీ వాక్యంలో నిలిచేదా - నిన్ను వెంబడించేదా (2) ఆరాధన యేసు నీకే ......... (4) 1.గాలి నీరు అగ్నియు - నీ అద్భుత మాటకు లోబడుచునే ఉనవి - అన్నీ వీళ్ళలా. (4) ఆరాధన యేసు నీకే .......... (4) 2.నీటిపైన నడిచిన - నీ అద్బుత పాధముల్ చుచుచునే నడిచేదా - అన్నీ వీళ్ళలా. (3) ఆరాధన యేసు నీకే ........ (4) నీ చిత్తము నే చేసెద - నీ బాటలో నడిచేదా నీ వాక్యంలో నిలిచేదా - నిన్ను వెంబడించేదా (2) ఆరాధన యేసు నీకే ......... (4)

yepati dhananaya

 ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు
నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2)
నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2)
ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది       ||ఏపాటి||

కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు నన్నాదరించావు (2)
అందరు నను విడచినా నను విడువని యేసయ్యా
విడువను యెడబాయనని నా తోడై నిలచితివా       ||ప్రేమించే||

నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా (2)
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా       ||ప్రేమించే||