నీవే నా ఆశ – నీవే నా శ్వాస
నీవే లేని నేను – లేనే లేను (x2)
యేసయ్యా ఆ ఆ ఆ… యేసయ్యా ఆ ఆ ఆ (x2)
1.అర్పించావు జీవం – నా కొరకై
ప్రకాశమానం నీవై – నను వెలిగించావు (x2) ||నీవే||
2.లెక్కింప జాలని సంతోషం – నా శోకానికి ప్రతిగా
అర్పించిన నీ బలియాగం – నే మరువలేను (x2) ||నీవే||