Skip to main content

manasara pujinchi

మనసారా పూజించి నిన్నారాధిస్తా
భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను
సంతోష గానాలను ఆలాపిస్తా

నిన్న నేడు ఉన్నవాడవు నీవు
ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు
పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు
నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు

రక్షణ కొరకై లోకానికి వచ్చావు
సాతాన్ని ఓడించిన విజయశీలుడవు
మరణము గెలిచి తిరిగి లేచావు
నీవే మర్గము సత్యము జీవము