Skip to main content

Nee chethitho nannu pattuko

నీ చేతితో నన్ను పట్టుకో
నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నన్ను చెక్కుము (2)

అంధకార లోయలోన
సంచరించినా భయములేదు
నీ వాక్యం శక్తిగలది
నా త్రోవకు నిత్యవెలుగు (2)

ఘోరపాపిని నేను తండ్రి
పాప ఊభిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్దిచేయుము
పొందనిమ్ము నీదు ప్రేమను (2)

ఈ భువిలో రాజు నీవే
నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను
జీవితాంతము సేవ చేసెదన్ (2)    ||నీ చేతితో||