Skip to main content

Ninnu Nenu Viduvanayya

నిన్ను నేను విడువనయ్య 
నీదు ప్రేమన్ మరువనయ్య
నీ దయలోనే నన్ను బ్రతికించయ్య 
నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్య
జీవితమే నీదు వరమయ్య 
నీదు మేళ్ళన్ నేను మరువనయ్య

కష్టాలలో నేనుండగా
నావారే దూషించగా 
వేదనతో చింతించెగా దేవా

సహాయమే లేకుండగా
నిరీక్షణే క్షీణించగా 
దయతో రక్షించయ్య దేవా

నీవే నా ఆథారం
నీవే నా ఆదరణ 
నను విడువద్దయ్య
ప్రియ ప్రభు యేసయ్య
నీవే నా సర్వం
నీవే నా సకలం 
నీ తోడుతోనే
నను బ్రతికించయ్య