Skip to main content

Raavayya Yesu Naathaa

రావయ్య యేసునాధా 
మా రక్షణ మార్గము
నీ సేవ జేయ మమ్ము 
జేపట్టుటకు

హద్దులేక మేము ఇల 
మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని 
దిద్ది రక్షింపను         
||రావయ్య||

నిండు వేడుకతోను 
మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు 
ఖండించుటకు        
||రావయ్య||

మేర లేని పాపము 
మాకు భారమైన మోపు
నీవు దూరంబుగా జేసి 
దారి జూపుటకు       
||రావయ్య||

పాపులమయ్య మేము 
పరమ తండ్రిని గానకను
మా పాపంబులన్నియు 
పారద్రోలుటకు          
||రావయ్య||

అందమైన నీదు పరమా
నంద పురమందు
మేమందరము జేరి 
యానందించుటకు         
||రావయ్య||