Skip to main content

Devudu Maa Pakshamuna Undaga

దేవుడు మా పక్షమున ఉండగా
మాకు విరోధి ఎవడు
మా  దేవుడు మా పక్షమున ఉండగా
మాకు విరోధి ఎవడు
జీవముగల దేవుని సైన్యముగా
సాతాను నోడింతుము

యుద్ధం యెహోవాదే
రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే
ఘనత యెహోవాదే

మా దేవుని బాహువే
తన దక్షిణ హస్తమే
ఆయన ముఖ కాంతియే
మాకు జయమిచ్చును
తనదగు ప్రజగా మము రూపించి
నిరతము మాపై కృప చూపించి
తన మహిమకై మము పంపించి
ప్రభావమును కనపరుచును

మా దేవుని ఎరిగిన
జనులముగా మేమందరం
బలముతొ ఘనకార్యముల్ 
చేసి చూపింతుము
దేవునిచే సూర క్రియలను చేసి
భూమిని తలక్రిందులుగా చేసి
యన నామము పైకెత్తి
ప్రభు ధ్వజము స్థాపింతుము