Skip to main content

Rammanuchunnaadu Ninnu

రమ్మనుచున్నాడు
నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి
రమ్మనుచున్నాడు (2)

ఎటువంటి శ్రమలందును
ఆదరణ నీకిచ్చునని (2)
గ్రహించి నీవు -యేసుని చూచిన
హద్దు-లేని ఇంపు పొందెదవు (2)

కన్నీరంతా తుడుచును
కనుపాపవలె కాపాడున్ (2)
కారు మేఘమువలె
కష్టములు వచ్చిననూ
కనికరించి నిన్ను కాపాడును (2) 

సోమ్మసిల్లు వేళలో
బలమును నీకిచ్చును (2)
ఆయన నీ వెలుగు 
రక్షణనై యుండును
ఆలసింపక త్వరపడి రమ్ము (2)

సకల వ్యాధులను 
స్వస్థత పరచుటకు (2)
శక్తిమంతుడగు 
ప్రభు యేసు ప్రేమతో
అందరికి తన కృపలనిచ్చున్ (2)