Skip to main content

YELO YELO SAMBARALU

 chorus

ఏలో ఏలో ఏలో అంటూ-వచ్చారండీ గొల్లలు
సంతోషాలే పొంగేనండీ-హైలెస్సా  introx2,
దారే చూపే దేవుడొచ్చే-ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండీ-హైలెస్సా

అంధకారాన్ని తొలగించే మహనీయుడు 
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు 
నిన్నే కోరి 
నిన్నే చేరి 
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు

1. 
లోకాలనేలేటి రారాజురా
ఉదయించె సూరీడై వచ్చాడురా 
ఆకాశ వీధి - మెరిసేటి దారి
ఒకతార మురిసిందిగా (2)

దూతాళి పాడి - కొలిచారు చూడు
ఘనమైన ఒక వేడుక  
ఆ గొల్లలేగా - దరువేసే చూడు
మెస్సయ్య - పుట్టాడనీ      
మన మెస్సయ్య – పుట్టాడనీ

2.
వెన్నెల్లో పూసింది ఓ సందడీ
పలికింది ఊరంతా ఈ సంగతీ  
ఈ దీనుడంట - పసిబాలుడంట
వెలిసాడు మహరాజుగా (2)

మనసున్న వాడు - దయ చూపువాడు 
అలనాటి అనుబంధమే
కనులారా చూడు - మనసారా వేడు 
దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే

3.
ఆ నింగి తారల్లా వెలగాలిరా 
జగమంత చూసేలా బ్రతకాలిరా 
వెలిగించు వాడు - మనలోని వాడు
నిలిచాడు మన తోడుగా  (2)

సలిగాలి రాత్రి  -  పిలిసింది సూడు
మనలోన ఒక పండగ
భయమేల నీకు - దిగులేల నీకు
యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా