నా ప్రాణమా యెహోవాను నీవు
సన్నుథించు కొనియాడు
నా నాధుడెసుని సన్నిధిలోను
సుఖ శాంతులు కలవు.//2//
యేసయ్యా నా యేసయ్యా
నిను వీడి క్షణమైనా
నేను బ్రథుకలెను స్వామి//2//
1.యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా
యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా//2//
నిను మరిపించే సుఖమె నాకు ఇలలో వద్దయ్యా
నిను స్మరియించే కష్టమె నాకు యెంతో మేలయ్యా//2//
2. మంచి దేవుడు యేసు మరచి పొనన్నాడు
మేలులెన్నో నాకొరకు ధాచివుంచినాడమ్మ
నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాతృడ కానయ్యా
ఆ ప్రెమలొనె నిరతము నన్ను నడుపుము యేసయ్యా //2//