Skip to main content

Posts

Showing posts from July, 2023

offerings praise


కుతూహల మార్భాటమే 
నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే 
నా యేసుని సన్నిధిలో (3)

పాపమంత పొయెను – రోగమంత తొలగెను
యేసుని రక్తము
క్రీస్తునందు జీవితం – కృపద్వారా రక్షణ 
పరిషుద్ద ఆత్మలో…. (2)

దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించే 
దేవాలయం నేనే
ఆత్మలోన దేవుడు – గుర్తించె నన్ను 
అద్బుత మద్బుతమె …. (2)

శక్తినిచ్చు యేసు –  జీవమిచ్చు యేసు  
జయంపై జయమిచ్చును
ఏకముగా కూడి –హోసన్న పాడి 
ఊరంతా చాటెదము…. (2)

బూరద్వనితొ – పరిషుద్దులతో 
యేసు రానై యు౦డే…
ఒక్క క్షణములోనే – రూపాంతరం పొంది 
మహిమలో ప్రవేశిద్దాం… (2)

preminchu devudu rakshinchu devudu

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు
పాలించు దేవుడు – యేసు దేవుడు
పాటలు పాడి ఆనందించెదం
ఆహా ఎంతో ఆనందమే (2)       ||ప్రేమించు||

తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు
ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు
తోడు నీడగా నన్ను కాపాడును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు
సర్వ కాలమందు జయమిచ్చును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు
అంతము వరకు చేయి విడువడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

sundarudaa athishayudaa

సుందరుడా… అతిశయుడా…
మహోన్నతుడా… నా ప్రియుడా (2)

పదివేలలో నీవు అతిసుందరుడవు
నా ప్రాణప్రియుడవు నీవే
షారోను పుష్పమా… లోయలోని పద్మమా…
నిను నేను కనుగొంటినే (2)         ||సుందరుడా||

నిను చూడాలని
నీ ప్రేమలో ఉండాలని
నేనాశించుచున్నాను (4)        ||సుందరుడా||

యేసయ్యా నా యేసయ్యా
నీ వంటి వారెవ్వరు
యేసయ్యా నా యేసయ్యా
నీలాగ లేరెవ్వరు (2)        ||సుందరుడా||

ee tharam yuvatharam

ఈ తరం యువతరం
ప్రభు యేసుకే అంకితం
నా బలం యవ్వనం
ప్రభు యేసుకే సొంతము
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు వార్త చాటుదాం
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం

సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా
దేవుని సేవ వ్యాపారమాయే
ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు

నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా
యేసయ్య రాకడ సామీపమాయే
ఆ వార్త చాటను వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు