Skip to main content

ne namamul lo ne

నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది
నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది (2)

నా ప్రాణము నా సర్వము 
నీవే నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా

నా శక్తియు నా ఆశ్రయం 
నీవే నా యేసయ్యా 
యేసయ్యా యేసయ్యా

దానియేలు సింహపు బోనులో ప్రార్ధించగా దేవా
సింహపు నోళ్లను మూసివేసినావు (2)
నా కష్టకాలమందు నే ప్రార్ధించగానే
నన్ను విడిపించిన నా యేసయ్యా

అబ్రాహాము విశ్వాసముతో వేచియుండగా దేవా
మూయబడిన శారా గర్భమును తెరిచితివి (2)
విశ్వాసముతో నే ప్రార్ధించగానే 
నా ఆశలన్నియు తీర్చిన దేవుడవు