Skip to main content

Posts

Showing posts from August, 2024

Sarveshwara neeke sthuthi

సర్వేశ్వరా నీకే స్తుతి – సర్వము నీకే ప్రభూ
ఆధారము ఆశ్రయము – నీవే నా యేసూ ||2||

నన్ను కన్న తండ్రి – నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి – ప్రాణమిచ్చిన తండ్రి ||2||

లలా లల్లలా
లలా లల్లలా
లలా లల్లలా లలా లల్లలా…..

1. చిన్న చిన్న గొర్రెపిల్లలకు
కాపరివై మము కాయుము
అమ్మానాన్న అన్నీ నీవే
ఆదరించి సేదదీర్చుము

2. చెంగు చెంగుమని దూకే నన్ను
కంగారు పడనీయకు
గుట్టలను, మెట్టలను
దాటించి నను మేపుము 

3. సంకెళ్ళ లోక బంధాలలో
ఎందాక నీవుందువు
ఓ సోదరా, ఓ సోదరీ
నేడే విడుదలనొందు 

Neeve na pranamu

నీవే నా ప్రాణము నీవే నా సర్వము
నీవే నా జీవము యేసయ్యా (2)
మరువలేను నీదు ప్రేమ
విడువలేనయ్యా నీ స్నేహం (3) 
మార్గం నీవే సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే (2)
అపాయము రాకుండా కాపాడువాడవు
నిను నేను ఆరాధింతున్ (2)
తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2)
బ్రతుకంతా నీ కొరకై జీవింతును
నిను నేను ఆరాధింతున్ (2)