Skip to main content

Kannillatho Nenu Krungipoga

కన్నీళ్లతో నేను కృంగిపోగా
గుండెకోతే నాకు మిగిలిపోగా

కన్నతండ్రి నీవైనావు దేవా
కన్నీరు తుడచినావు ప్రభువా

నా పాప  జీవితాన్ని 
సిలువలో నువు మోసి 
నూతన జీవితమిచ్చి 
నీ సాక్షిగా నిలిపితివి 

అనుక్షణం నీలోనే హర్షిస్తా  
విలువైన ప్రేమను నే చాటిస్తా

యవ్వన కాలమందు 
నీ కాడి మోయుట 
నరునికి మేలని ఎంచి
నే సాగెదనయ్య

నా యవ్వనం నీకోసమర్పిస్తా 
సిలువ సాక్షిగా నే జీవిస్తా

నా తోడై నిలిచి నీవు నడుపుమయ్యా
నీలోనే అంతము వరకు నిలుపుమయ్యా