Skip to main content

nazarethu vada

నజరేతువాడా  యూదుల  రాజా  
ఇమ్మానుయేల్  ప్రభూ  నీకే   స్తోత్రం 
అబ్రాహాము  దేవా  ఇస్సాకు  దేవా  
యాకోబు  దేవా  నీకే  స్తోత్రం 

పాపము  చేసిన  నరునికి  రక్షణ కోసం  పరమును  వీడి
మరియా  తనయుడిగా  పశుల  పాకలో  బాలుడు  యేసుగా  పుట్టి
సిలువను  భుజమున  మోసి  మరణముపై  విజయమును  ప్రకటించి
యేసు నీ  ప్రేమ  యేసు నీ  కరుణ  
యేసు నీ  త్యాగం  యేసు నీ   మహిమ
నీకే  నీకే  నీకే  చెల్లును  
ఆ   హల్లెలూయా   హల్లెలూయా  హల్లెలూయా

ఎన్నో  సూచక  క్రియలు మాకై  చేసి శిష్యులను  పిలచి
సర్వ  సత్యమును   నడుపగ   నీ  ఆత్మ   మాపై   పంపి 
రొండో   రాకను   నమ్మిన   వారును   ఎత్తబడే   ఆకర్షణకు
యేసు నీ  ప్రేమ  యేసు నీ  కరుణ 
 యేసు నీ  త్యాగం  యేసు నీ   మహిమ
నీకే  నీకే  నీకే  చెల్లును  
ఆ   హల్లెలూయా   హల్లెలూయా  హల్లెలూయా