Skip to main content

Posts

Showing posts from March, 2021

Yehovaa Nee Naamamu

 యెహోవా నీ నామము ఎంతో బలమైనది

ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ…ఆ…ఆ…  ఎంతో ఘనమైనది         || యెహోవా ||

మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2)          || యెహోవా ||

నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2)                   || యెహోవా ||

సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2)                        || యెహోవా ||

చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2)               || యెహోవా ||

పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2)              ||యెహోవ||

na balamantha neevenaya

నా బలమంతా నీవేనయ్యా
నా బలమంతా నీవేనయ్యా (2)

అలలు లేచిననూ 
తుఫాను ఎగసిననూ (2)
కాపాడే దేవుడవయ్యా
నీవు ఎన్నడు మారవయ్యా (2)       

సోలిన వేళలలో 
బలము లేనప్పుడు (2)
(నన్ను) ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే (2)       


జీవం నీవేనయ్యా
స్నేహం నీవేనయ్యా
ప్రియుడవు నీవేనయ్యా
సర్వస్వం నీవేనయ్యా (3)       

Jayam jayam halleluya



జయం జయం హల్లెలూయ జయం జయం ఇప్పుడే #2#

మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడే

సాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం#

1.మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడే

ఇమ్మానుయేలుకో జయం జయం ఇప్పుడే

సాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం#

2.  మరియ కుమారునికి జయం జయం ఇప్పుడే

మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడే

సాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం#

3. ప్రభు యేసు నాదునికి జయం జయం ఇప్పుడే

మరియ కుమారునికి జయం జయం ఇప్పుడే

షాలోము రాజుకు జయం జయం ఇప్పుడే #జయం#



yesu rakshakaa shathakoti sthothram

యేసు రక్షకా శతకోటి స్తోత్రం
జీవన దాత కోటి కోటి స్తోత్రం
యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2)
నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2)
యేసు ఆరాధించెదను – ఆరాధించెదను

శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు
నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2)
నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2)
చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2) ||యేసు రక్షకా||

పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు
ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2)
తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2)
నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2) ||యేసు రక్షకా||

యేసు ఆరాధించెదను – ఆరాధించెదను
నా సమస్తము అర్పించి – ఆరాధించెదను
నా సర్వము అర్పించి – ఆరాధించెదను
శరణం శరణం యేసు స్వామి శరణం (3) ||యేసు ఆరాధించెదను||

Aarani Prema Idi

 ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2)

అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది
అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2)
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)       ||ఆరని||

సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2)
ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)       ||ఆరని||

నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి
క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది (2)
నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది (2)
ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది (2)       ||ఆరని||

భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు
చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన (2)
ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు (2)
ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది (2)       ||ఆరని||

Idigo Devaa Naa Jeevitham

ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4)

పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం

నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము

విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా

yesu rakthamu

యేసు రక్తము రక్తము రక్తము 
యేసు రక్తము రక్తము రక్తము    
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము    

ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము
బహు దుఖములో మునిగెనే
చమట రక్తముగా మారెనే

మనః సాక్షిని శుద్ది చేయును
మన యేసయ్య రక్తము
మన శిక్షను తొలగించును
సంహారమునే తప్పించెను
 
మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము
మన ప్రధాన యాజకుడు
మన కంటి ముందుగా వెళ్ళెను

na neethi neeve

నా నీతి నీవే నా ఖ్యాతి నీవే

నా దైవమా యేసయ్యా
నా క్రియలు కాదు నీ కృపయే దేవా
నా ప్రాణమా యేసయ్యా
నదులంత తైలం విస్తార బలులు
నీకిచ్చినా చాలవయ్యా
నీ జీవితాన్నే నాకిచ్చినావు
నీకే నా జీవమయ్యా
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4)       ||నా నీతి||

నా దీన స్థితిని గమనించి నీవు
దాసునిగ వచ్చావుగా
నా దోష శిక్ష భరియించి నీవు
నను నీలో దాచావుగా
ఏమంత ప్రేమ నా మీద నీకు
నీ ప్రాణమిచ్చావుగా
నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను
యజమానుడవు నీవేగా ||హల్లెలూయ||

నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు
నీవు చేరదీసావుగా
నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి
కన్నీరు తుడిచావుగా
నేనున్న నీకు భయమేలనంటూ
ఓదార్పునిచ్చావుగా
చాలయ్య దేవ నీ కృపయే నాకు
బ్రతుకంతయు పండుగా         ||హల్లెలూయ||

ఆ ఊభిలోనా నే చిక్కినప్పుడు
నీవు నన్ను చూసావుగా
నీ చేయి చాపి నను పైకి లేపి
నీ వాక్కునిచ్చావుగా
నా సంకటములు నా ఋణపు గిరులు
అన్నిటిని తీర్చావుగా
నీలోన నాకు నవ జీవమిచ్చి
నీ సాక్షిగా నిలిపావుగా        ||హల్లెలూయ||

Nee Kaaryamulu

 నీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4)

నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనే
నీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనే
నీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనే
నీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే (2)

మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివే
ఆ మన్నా నీవే యేసయ్యా
ఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివే
నా పోషకుడవు నీవే కదా (2)        ||నీవు సెలవియ్యగా||

లాజరు మరణించగా – మరణము నుండి లేపితివే
మోడైనను చిగురింపచేసెదవు
కానాన్ వివాహము ఆగిపోవుచుండగా
నీ కార్యముతో జరిగించితివే
నీ కార్యముతో (12)
సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా
ఈ క్షణమే యేసయ్యా (8)       ౹౹నీవు సెలవియ్యగా౹౹

Ne Saageda Yesunitho

నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా (2)

యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా            ||నే సాగెద||

వెనుక శత్రువులు వెంటాడిననూ (2)
ముందు సముద్రము ఎదురొచ్చినా (2)
మోషె వలె సాగెదా             ||నే సాగెద||

లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)
కఠినులు రాళ్ళతో హింసించినా (2)
స్తెఫను వలె సాగెదా            ||నే సాగెద||

బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)
పౌలు వలె సాగెదా             ||నే సాగెద||

తల్లి మరచిన తండ్రి విడచిన (2)
బంధువులే నన్ను వెలివేసినా (2)
బలవంతుని వలె సాగెదా    ||నే సాగెద||

Siluvalo Aa Siluvalo

సిలువలో ఆ సిలువలో 
ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో 
వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా 
బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా 
నీవెంతో అలసితివా (2)

నేరం చేయని నీవు
ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ
మోయలేక మోసావు (2)
కొరడాలు చెళ్ళిని చీల్చెనే
నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువును
రుధిరంపు ధారలు

వధకు సిద్దమైన
గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ
మౌనివైనావే (2)
దూషించి అపహసించి
హింసించిరా నిన్ను
ఊహకు అందదు
నీ త్యాగ యేసయ్యా

నాదు పాపమె నిన్ను
సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను
అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారలే
నా రక్షణాధారం
సిలువను చేరెదన్
విరిగిన హృదయముతోను

నా యేసు నా రక్షకా

నా యేసు నా రక్షకా - నా ప్రభువు నీవే కదా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యేసువా
 మా యేసుదేవా - మహా యేసుదేవా
కరుణ గల రాజా మా శరణం నీవే కాదా

1.సంద్రము పాయలు చేసిన దేవా
శతృసమూహమున్ కూల్చిన దేవా 
మన్నాను కురిపించి - పోషించినావా(హల్లెలూయా)