Skip to main content

Posts

Showing posts from July, 2021

NEE KANTIPAAPAVALE

 నీ కంటి పాపవలె నన్ను కాచుటకు

నేను అర్హుడనా నేను అర్హుడనా ఘోరపాపినైన నన్ను మన్నించుటకు నేను అర్హుడనా నేను అర్హుడనా వేదనను భరియించి అవమానం సహియించి నా కొరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా

1. నన్ను పరమున చేర్చుటకు - నీవే నా దరి చేరితివి నాకు విడుదల నిచ్చుటకు - నా దోషములను మోసితివి నా శాపము తొలగించుటకు - నీవే పాపముగా మారి నన్ను శుద్ధుని చేయుటకు - నీ రక్తము చిందించితివి నాలో ఊపిరి నిలుపుటకు - నీ తుది శ్వాస వీడితివి ఇంత ప్రేమ చూపుటకు - నే అర్హుడనా నాలో ఊపిరి నిలుపుటకు - నీ తుది శ్వాస వీడితివి ఇంత ప్రేమ చూపుటకు - నే అర్హుడనా నీ కంటి పాపవలె నన్ను కాచుటకు నేను అర్హుడనా నేను అర్హుడనా ఘోరపాపినైన నన్ను మన్నించుటకు నేను అర్హుడనా నేను అర్హుడనా

2.
అల్పుడను నను కరుణించి - రక్షణ కవచము నాకిచ్చి యోగ్యుడవంటు నను పిలచి - నీ వారసునిగా చేసితివి అర్పింతును యేసు నీకే - సర్వ ఘనత ప్రభావములు నా జీవిత పరియంతము - నీ దాసుడనై బ్రతికెదను నీ చరణములను హత్తుకుని - అద్దరి చేరుకుందునయా నీ మహిమా కాంతులలో - నివసింతునయా నీ చరణములను హత్తుకుని - అద్దరి చేరుకుందునయా నీ మహిమా కాంతులలో - నివసింతునయా

Enni Thalachinaa

 ఎన్ని తలచినా ఏది అడిగినా

జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా

నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా      ||ఎన్ని||

నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా      ||ఎన్ని||

ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా      ||ఎన్ని||

నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా         ||ఎన్ని||

yehova yiere

 యెహోవా యీరే నను చూచు దేవా – నీవుండుటయే చాలు

యెహోవా రాఫా స్వస్థ ప్రదాత – నీ గాయమే బాగు చేయు యెహోవా షమ్మా తోడుండువాడా – నా అక్కరలను తీర్చు నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2) యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా – నీ వాక్కుయే ఈ సృష్టి యెహోవా ఎలైన్ మహోన్నతుడా – నీకు సాటి లేరెవరు యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత – నా హృదిలోనికి రమ్ము నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2) యెహోవా ఎల్ షద్దాయి బహు శక్తిమంతుడా – నా బలమే నీవు కదా యెహోవా రోహి నా మంచి కాపరి – నీ కరుణతో కాపాడు యెహోవా నిస్సి జయమిచ్చు దేవా – నాకభయము నీవే ప్రభు నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (4)

Needhu perma

 నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు

నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావు
మంటివాడను నన్ను నీవు మహిమపరిచావు
మరణపాత్రుడనైన నన్ను పరము చేర్చావు
ఎంత ప్రేమ యేసయ్యా – నీకెంత నాపై కరుణయో
మరువగలనా నీ కృప – బ్రతుకంతయు (2)

తోడువైనావు నా నీడవైనావు
నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు
మంచి కాపరి నీవేనయ్యా నా యేసయ్యా
ఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా
జీవితమంతా మరువలేనయ్యా           ||నీదు ప్రేమ||

ప్రాణమైనావు నీవే ధ్యానమైనావు
అన్నీ నీవై చేరదీసి ఆశ్రయమైనావు
నీతిసూర్యుడా పరిపూర్ణుడా నిత్య దేవుడా
కీర్తనీయుడా కృపాపూర్ణుడా సత్యజీవుడా
నేను నిన్ను విడువలేనయ్యా           ||నీదు ప్రేమ||