Skip to main content

Posts

Showing posts from September, 2021

Kruthagnathatho Sthuthi Paaded

కృతజ్ఞతతో స్తుతి పాడెద
నా యేసు నాథా
నాకై నీవు చేసిన మేళ్లకై
కోటి కోటి కృతజ్ఞతలు (2)

అర్హతే లేని నాపై నీదు
ప్రేమ చూపిన కృపామయా (2)
నా ఊహలకంటెను అధికముగా
దయచేయు ప్రేమామయా (2)         

నిజ రక్షకుడు యేసు క్రీస్తని
విశ్వసించెద అను నిత్యము (2)
నీ పాద సేవలో బ్రతుకుటకై
నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై
వరములతో అభిషేకించు       

Asaadhyamainadi Lene Ledu

 అసాధ్యమైనది లేనే లేదు
నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2)
ఊహించలేని ఆశ్చర్యక్రియలలో
నా దేవుడు నన్ను నడిపించును (2)
సాధ్యమే అన్ని సాధ్యమే
నా యేసు తోడైయుండగా (2)

శోధన శ్రమలు వచ్చినను
ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2)
సత్య స్వరూపి సర్వోన్నతుడైన
గొప్ప దేవుడు నన్ను బలపరచును (2)         ||సాధ్యమే||

సాతాను శక్తులు ఎదిరించిన
వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2)
సర్వశక్తుడు తన శక్తితో నింపి
సాతానుపై నాకు జయమిచ్చును (2)         ||సాధ్యమే||

Raajaa Nee Bhavanamulo

 (యేసు) రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుందు (2)
(నిన్ను) స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను (2)

నా బలమా నా కోట-ఆరాధన నీకే (2)
నా దుర్గమా ఆశ్రయమా-ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా

అంతట నివసించు 
యెహోవా ఎలోహిం-ఆరాధన నీకే (2)
మా యొక్క నీతి 
యెహోవా సిద్కేను-ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా

పరిశుద్ధ పరచు
 యెహోవా మెక్కాని-ఆరాధన నీకే (2)
రూపించి దైవం 
యెహోవా హోషేను-ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా

Yessaya yessaya

 పల్లవి: 
నన్ను బ్రతికించుటకు -నీవు మరణించివే 
నా పాపం కడుగుటకు -నీ రక్తం కాచితివే
అయ్యా నీ త్యాగము వర్ణనాతీతము
చేయ నీ ధ్యానము-జీవితాంతము
యేసయ్యా... యేసయ్యా
యేసయ్యా.... ఆ.. యేసయ్యా-2
1. ఏ నేరం చేసావని
    మోసావయ్య పాప భారం
    ఏ ఘోరం చేశావని
   తీసారయ్య నీదు ప్రాణం-2
యేసయ్యా... యేసయ్యా
యేసయ్యా.... ఆ.. యేసయ్యా-2
2. ఏ అర్హత నాకుందని
   కార్చావు నీ శుద్దరుధిరం
  ఏ యోగ్యత నాకుందని
  చేశావు ఆ శిలువ యాగం-2
యేసయ్యా... యేసయ్యా
యేసయ్యా.... ఆ.. యేసయ్యా-2

Deva Samsthuthi Cheyave Manasaa

దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా – నా యంతరంగము
లో వసించు నో సమస్తమా          ||దేవ||

జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే          ||దేవ||

చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే          ||దేవ||

యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే          ||దేవ||

Daatrutvamunu kaligi

దాత్రుత్వమును గలిగి పెరుగుదమ = ధనము – ధాత్రి దేవుని దంచు నెఱుగుదమ
1. శక్తికొలది కాన్కలర్పింతమ = మన – భుక్తినుండి కొంత దీయుదమ
2.సంతోషముగ నియ్య సాగుదమ = మన – స్సంతటితో జేయ నేగుదమ
3.గర్వఘనములు వీడి యర్పింతమ = యుర్వి – సర్వ మాయనదంచు నేర్పింతమ
4.సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ = క్రీస్తు – సంఘ యక్కఱ
లన్ని తీర్చుదమ
5.ప్రతియాదివార  మిది మది నుంతమ = దీని ప్రతి సంఘస్థుడు చేయ బోధింతమ
6.విధి దలచి దుర్బలుల రక్షింతమ = సంఘ – విధవాళి దానముతో దర్శింతము
7.దిక్కులేని జనుల దీవింతమ = వారి – యక్కఱలలో మేలు గావింతమ
8. పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ = మఱల – నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ
9.వెదజల్లి యభివృద్ది పొందుదమ = మోక్ష – పదవు లను భవింప బరుగిడుదమ
10.వర్ధిల్లిన కొలది చెల్లింతము = లోక – వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ

Yesu dhevuni aaradhikulam

యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం (2)
మరణమైన, శ్రమ ఎదురైన, బెదిరిపోని విశ్వాసులం (2)
మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం (2)
ప్రాణమిచ్చి, మృతిని గెల్చిన, యేసురాజే మా అతిశయం (2)

1. షద్రకు మేషాకు అబెద్నగోలను 
  అగ్నిగుండంలో త్రోయబోగా (2)
  నెబుకద్నెజరుమాకు చింతియే 
  లేదులే మా దేవుడు మమ్మును రక్షించులే (2)
  అని తెగించి, విశ్వసించి, ముగ్గురు నలుగురై జయించిరే (2)
2. శత్రుసైన్యము దండెత్తి వచ్చెగా
   యెహొషాపాతు ప్రార్ధిన చేసెగా (2)
   యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా
   భయమె లేక వారు జయగీతం పాడగా (2)
   ఆత్మతోడ, స్తుతియిస్తుండ, దేవుడె యుద్ధం జరిగించెగా (గెలిపించెగా) (2)
3. శత్రు గొల్యతు సవాలు విసిరెగా
    దేవుని ప్రజలంతా మౌనమాయెగా (2)
    ఒక్క దావీదు రోషముతో లేచెగా
   జీవము గల దేవుని నమాన్ని చాటెగా (2)
  చిన్న రాయి, వడిసె తోడ, ఆత్మశక్తితో జయించెగా (2)