Skip to main content

Posts

Showing posts from August, 2022

Praarthana Vinedi Paavanudaa

ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన||

శ్రేష్టమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రనుతించెదము
పరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

పరమ దేవుడవని తెలిసి
కరము లెత్తి జంటగా మోడ్చి
శిరమునువంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

దినదినంబు చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యి దిటముగా కొండను
చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

శత్రుమూక నిను చుట్టుకొని
సిలువపైన నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ
సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

Raavayya Yesu Naathaa

రావయ్య యేసునాధా 
మా రక్షణ మార్గము
నీ సేవ జేయ మమ్ము 
జేపట్టుటకు

హద్దులేక మేము ఇల 
మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని 
దిద్ది రక్షింపను         
||రావయ్య||

నిండు వేడుకతోను 
మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు 
ఖండించుటకు        
||రావయ్య||

మేర లేని పాపము 
మాకు భారమైన మోపు
నీవు దూరంబుగా జేసి 
దారి జూపుటకు       
||రావయ్య||

పాపులమయ్య మేము 
పరమ తండ్రిని గానకను
మా పాపంబులన్నియు 
పారద్రోలుటకు          
||రావయ్య||

అందమైన నీదు పరమా
నంద పురమందు
మేమందరము జేరి 
యానందించుటకు         
||రావయ్య||

deva mahonnathuda

దేవా మహోన్నతుడా
మహిమా ప్రకాశితుడా
పది వేలలో అతి సుందరుడా 
కీర్తింతు మనసారా
..దేవా..

వెలిశావు భువిలో మెస్సయ్యగా 
ఎడారి బ్రతుకులో సెలయేరుగా
నిస్సారమైనా నా జీవితములో
చిగురించె ఆనందము
..దేవా..

వెదికాను నీ దరి ఒంటరినై
నిలిచాను నీ దరి అన్వేసినై 
నీ దివ్య మార్గం చూపించినా
ఫలియించె నా జన్మము