Skip to main content

Posts

Showing posts from December, 2022

yessaya neekrupa naku chalaya

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2)     ||నీ కృప||

మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

Naa priya yesu padhi

నా ప్రియ యేసు పది వేలలో అతి సుందరుడా సుందరుడా (2)

యేసు.......వా...హా.....

నీదే రాజ్యము నీదే బలము నీకే మహిమ కలుగును ఆమెన్ (2)

యేసు.....వా.....హా....

Yehova naku velugu

యెహోవా నాకు వెలగయె
యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయ్యె
నేను ఎవరికీ ఎన్నడు భయపడను

నాకు మార్గమును ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించే (2) 
నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో 
స్తుతి గానము చేసేదను( 2) 

నా కొండయు నా కోటయు
నా ఆశ్రయము నీవే (2)
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసేదను (2)

నా తల్లియు నా తండ్రియు
ఒకవేళ విడచినను (2)
ఆపత్కాలములో చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును (2) 

mashup

నజరేతు పట్నాన నగుమల్లె దరని లొ
యొసేపు మరియమ్మ నగుమల్లె దరని లొ
హల్లెలుయ (x4)

మేము వెల్లి చూచినాము స్వామి యెసు నాదుని
ప్రెమ మ్రొక్కి వచినాము మామనమ్బు లల్లరగ
బెతలెము పురములొన బీద కన్య మరియకు
పేదగ సురూపు దాల్చి వెలసె పశుల పాకలొ

పేద వడ్ల వారి కన్య మరియమ్మ
ప్రెమ గల యేసు తల్లి మరియమ్మ
ప్రెమ గల్ల యెసు తల్లి
పెరెల్లిన దేవ దేవుడె యెసయ్య
ప్రెమ గల అవతారం
స్వర్గ ద్వరాలు తెరిచిరి యెసయ్య
స్వర్గ రాజు పుట్ట గనె యెసయ్య
స్వర్గ రాజు పుట్ట గనె
సరుగున దూతల్ వచిరి యెసయ్య
చక్కని పాటల్ పాడిరి

నువు బొయె దారి లొ యెరుశలెము
గుడి కాడ అచం మల్లె పూల తొట యెసయ్య
దొడ్డు దొడ్డు బైబిలు దొసిట్లొ పెట్టుకొని
దొరొల్లె బయిలెల్లి నాడె యెసయ్య

రాజులకు రాజు పుట్టన్నయ్య
రా రె చూడ మనం ఎల్లుదం అన్నయ్య
తారన్ జూచి తూర్పు గ్యనుల్ అన్నయ్య
తరలి నారె బెత్లహెమ్ అన్నయ్య

పద ర పొదాము రన్న
శ్రి యెసుని చూడ
పద ర పొదము రన్న
శ్రి యెసన్న నట లొక రక్షకుడట
శ్రి యెసన్న నట లొక రక్షకుడట
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట
పద ర హెయ్ పద ర హెయ్
పద ర పొదము రన్న
శ్రి యెసుని చూడ
పద ర పొదాము రన్న

tara velisindi

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు అందించాడు (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని (2) ||తార||

మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే లోక
రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే         ||తార||

బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే         ||తార||

YELO YELO SAMBARALU

 chorus

ఏలో ఏలో ఏలో అంటూ-వచ్చారండీ గొల్లలు
సంతోషాలే పొంగేనండీ-హైలెస్సా  introx2,
దారే చూపే దేవుడొచ్చే-ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండీ-హైలెస్సా

అంధకారాన్ని తొలగించే మహనీయుడు 
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు 
నిన్నే కోరి 
నిన్నే చేరి 
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు

1. 
లోకాలనేలేటి రారాజురా
ఉదయించె సూరీడై వచ్చాడురా 
ఆకాశ వీధి - మెరిసేటి దారి
ఒకతార మురిసిందిగా (2)

దూతాళి పాడి - కొలిచారు చూడు
ఘనమైన ఒక వేడుక  
ఆ గొల్లలేగా - దరువేసే చూడు
మెస్సయ్య - పుట్టాడనీ      
మన మెస్సయ్య – పుట్టాడనీ

2.
వెన్నెల్లో పూసింది ఓ సందడీ
పలికింది ఊరంతా ఈ సంగతీ  
ఈ దీనుడంట - పసిబాలుడంట
వెలిసాడు మహరాజుగా (2)

మనసున్న వాడు - దయ చూపువాడు 
అలనాటి అనుబంధమే
కనులారా చూడు - మనసారా వేడు 
దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే

3.
ఆ నింగి తారల్లా వెలగాలిరా 
జగమంత చూసేలా బ్రతకాలిరా 
వెలిగించు వాడు - మనలోని వాడు
నిలిచాడు మన తోడుగా  (2)

సలిగాలి రాత్రి  -  పిలిసింది సూడు
మనలోన ఒక పండగ
భయమేల నీకు - దిగులేల నీకు
యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా

NASHIYINCHU AATHMALENNIYO

నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా
పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ
పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ..

నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా
నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా
అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2)
లోకాన చాటగా (4) ||నశియించు||

ఈ లోక భోగము – నీకేల సోదరా
నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా
ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2)
ప్రియ యేసు కోరెను (4) ||నశియించు||

Kreesthu Puttenu

 క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను
రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే (2)
అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే

పరలోక దూతాలి పాట పాడగా
పామరుల హృదయాలు పరవశించగా (2)
అజ్ఞానము అదృష్యమాయెను
అంధకార బంధకములు తొలగిపోయెను (2)    || అరె గొల్లలొచ్చి ||

కరుణగల రక్షకుడు ధర కేగెను
పరమును వీడి కడు దీనుడాయెను (2)
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2)      || అరె గొల్లలొచ్చి ||

Rakhwala YESHU Hai Rakhwala

Har musibat ki zanzeer 
se chudaane wala hai tu
Har bigdi zindagi ko banane wala hai tu
Meri zindagi ki kashti tufaano me hai ghiri
Par ae MASIH mera rakhwala hai tu

Pre-Chorus :
Jinko aakho se humne na dekha hai kabhi
Aaj usne badal di humari zindagi

Har musibat mein mujhko/humko/sabko sambhala
Har musibat mein mujhko/humko/sabko sambhala

Chorus :
Rakhwala
YESHU hai rakhwala
Oh rakhwala
YESHU hai rakhwala

Verse 1 :
Har musibat mein vo kaam aaya mujhe
Marte marte YESHU ne bachaya mujhe

Verse 2 :
Jab MASIHA ka didhar ho jaeyga
Tera bigda hua kaam ban jaega

Verse 3 :
Vo dharti ka raja vo sarkar hai
Nirala MASIHA ka darbar hai

Viluve Leni Naa Jeevitham

విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు
నీ జీవితాన్నే ధారబోసితివే (2)

నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా
ఎన్ని యుగాలైనా మారదు
ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)

పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో లేపితివే
రోగమే నన్ను చుట్టుకొనియుండగా
రోదనతో ఒంటరినైయుండగా
నా కన్నీటిని తుడిచితివే (2)        ||నీది||

పగలంతా మేఘ స్తంభమై
రాత్రంతా అగ్ని స్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే
స్నేహితులే నన్ను వదిలేసినా
బంధువులే భారమని తలచినా
నా కొరకే బలి అయితివే (2)        ||నీది||

సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా యేసుకు సమస్తము
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా ప్రియునికి సమస్తము (2)

ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)          ||విలువేలేని||