నీ రక్తమే నీ రక్తమేనన్
శుద్ధీకరించున్
నీ రక్తమే నా బలము
నీ రక్తధారలేయిల
పాపికాశ్రయంబిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పావన పరచుము
నశించు వారికి నీ సిలువ
వెర్రితనముగా నున్నది
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియై యున్నది
నీ సిలువలో కార్చినట్టి
విలువైన రక్తములోన
పరమ పావన కడుగుము
పవిత్ర పరచుము పాపిని
పందివలె పొర్లిన నన్ను
కుక్క వలె తిరిగిన నన్ను
ప్రేమతొ చేర్చుకొంటివి
ప్రేమార్హ నీకె స్తోత్రము
నన్ వెంబడించు సాతాన్
నన్ బెదరించు సాతానున్
దును మాడేది నీ రక్తమే
దహించేది నీ రక్తమే
స్తుతి మహిమ ఘనతయు
యుగ యుగంబులకు
స్తుతి పాత్ర నీకె చెల్లును
స్తోత్రార్హ నీకె తగును