Skip to main content

Posts

Showing posts from September, 2024

Raja Nee Sannidhilone

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2)

నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా (2)
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా (2)
 
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం (2)
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును (2)
నీవే రాకపోతే నేనేమైపోదునో (2)

ఒంటరి పోరు నన్ను విసిగించినా
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2)
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు (2)
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2)

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా (2)
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2)
నిన్ను మించిన దేవుడే లేడయ్యా (2)

More love more power

More love, more power
More of You in my life
More love, more power
More of You in my life

And I will worship You, with all of my heart
I will worship You, with all of my mind
I will worship You, with all of my strength
For You are my Lord
You are my God

పాపము నుండి విడిపించి నావు 
పరిశుద్ధుని చేసి ప్రేమించినావు 
నీవే కదా దేవుడవు 
దేవా యేసు దేవా 

పరిశుద్ధాత్మను నాలో నింపావు 
మట్టి దేహమును మహిమతో నింపావు
నీవే కదా దేవుడవు 
దేవా యేసు దేవా 

దేవా నా దేవా నీవే నా కాపరి 
నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది 

ఆరాధింతును హృదయంతరంగములో
స్తుతించెదను నీ పాద సన్నిధిలో 
నీవే కదా దేవుడవు 
దేవా యేసు దేవా

Nee Dhanamu Nee Ghanamu

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమా భాగమునీయ వెనుదీతువా
వెనుదీతువా

ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా (2)
పరలోక నాధుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా 

పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా (2)
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా

వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)
వెలిగించ ధర పైని ప్రభు నామము
కలిమి కొలది ప్రభున కర్పింపవా 

కలిగించె సకలంబు సమృద్దిగా
తొలగించె పలుభాధ భరితంబులు (2)
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా 

O Mahima Meghama

ఓ మహిమ మేఘమా
ఈ స్థలము నింపుమా   
ఓ మహిమ మేఘమా
ఈ జనులను నింపుమా... 2   

ఎడబాయని మేఘమా 
నాతో నడిచే మేఘమా  
ఎడబాయని మేఘమా 
నాలో నిలిచే మేఘమా -2

ఆత్మ మేఘమా .... 
పరిశుదాత్మ మేఘమా ... 
పరిశుదాత్మ మేఘమా 
మహిమ ఆత్మ మేఘమా -2

నా మాటలో నా పాటలో 
నా చూపులో నా నడతలో 
నీవుండుమయ్య..... 
నా ప్రాణంలో నా ఆత్మలో 
నా దేహంలో నా క్రియలలో 
నీవుందామయ్య..... 

ప్రేమ చూపు దైవమా ... 
సర్వోన్నత మేఘమా 
నన్ను ఏలు పరిశుద్దాత్ముడా 
స్తోత్రం అయ్యా... 2 

Neelanti Dhaivam

నీలాంటి దైవం ఎవరు 
విశ్వమున లేనేలేరు "2"

పరమతండ్రి నీకే వందన...
(నీదు బిడ్డగానే సాగేద)
యేసునాథ నీకే వందన...
(జీవితాంతం నీకై బ్రతికెద)
పవిత్రాత్మ నీకే వందన...
(నిత్యమునే నీతో నడిచెద)
త్రియేక దేవా వందన....
(ఘనపరతు నిన్నే నిరతము)

నీతి గల దైవం నీవే 
కరుణ చూపు దాతవు నీవే "2"
మొరను ఆలకించు నా దేవా 
రక్షణాధారం నీవేగా "2"
నీవుంటే చాలు నాకు దిగులే లేదు 
నీ ప్రేమే చూడగానే సక్కతియే "2"

సర్వోన్నతుడా నీకే స్తోత్రం 
మహాఘనుడా నీకే సర్వం "2" 
శక్తి దాత దైవం నీవేగా
నీదు ఆత్మవరములు కోరేదా "2"
వేరేమి కోరలేను జీవితాంతం
నీ దయలోకాయుమయ్య బ్రతుకు దినం "2"

Nammakamaina Devudavaina

నమ్మకమైన దేవుడవైన
 నీవే చాలు యేసయ్యా (2)

నేనేమైయున్నా 
ఏ స్థితిలో ఉన్నా (2)

ఇంకేమి కోరుకోనయ్యా (2)

ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా (2)
న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2)        

జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా (2)
శాపము బాపే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2)

కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా (2)
సాయము చేసే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2)

Kannillatho Nenu Krungipoga

కన్నీళ్లతో నేను కృంగిపోగా
గుండెకోతే నాకు మిగిలిపోగా

కన్నతండ్రి నీవైనావు దేవా
కన్నీరు తుడచినావు ప్రభువా

నా పాప  జీవితాన్ని 
సిలువలో నువు మోసి 
నూతన జీవితమిచ్చి 
నీ సాక్షిగా నిలిపితివి 

అనుక్షణం నీలోనే హర్షిస్తా  
విలువైన ప్రేమను నే చాటిస్తా

యవ్వన కాలమందు 
నీ కాడి మోయుట 
నరునికి మేలని ఎంచి
నే సాగెదనయ్య

నా యవ్వనం నీకోసమర్పిస్తా 
సిలువ సాక్షిగా నే జీవిస్తా

నా తోడై నిలిచి నీవు నడుపుమయ్యా
నీలోనే అంతము వరకు నిలుపుమయ్యా

Yese Naa Aashrayamu

యేసే నా ఆశ్రయము
యేసే నా ఆధారము

నా కోట నీవే… 
నా దుర్గము నీవే
నా కాపరి నీవే (2)

శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా
కష్టాల ఊభిలో కూరుకున్ననూ (2)
నన్ను లేవనెత్తును నన్ను బలపరచును
నాకు శక్తినిచ్చి నడిపించును (2) 

జీవ నావలో తుఫాను చెలరేగినా
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)
నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును
చుక్కాని అయి దారిచుపును (2)

దినమంతయు చీకటి అలుముకున్ననూ
బ్రతుకే భారమైన సంద్రమైననూ (2)
నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును
నా నావలో నాతో నుండును (2)

athyunnatha simhasanamupai hosanna

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు

నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా ॥2॥

ప్రతి వసంతము 
నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు
 నీ మహిమను వివరించునే

ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో-కృతజ్ఞాతార్పణలతో

పరిమళించునే 
నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను
నడిపించుచున్నందునే

పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో-హర్ష ధ్వనులతో

పక్షి రాజువై 
నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే 
నా బాధ్యతలు భరించితివే

యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో 

balamaina dhaevudavu balavmthudavu neevu

బలమైన దేవుడవు
బలవంతుడవు నీవు
శూన్యములో సమస్తమును
నిరాకారములో ఆకారాము
సృజియించినావు నీవు
సర్వ సృష్టి కర్తవు నీవు (2)

హల్లెలూయా........హల్లెలూయా (2)
హల్లెలూయా........హల్లెలూయా 
హోసన్న
హల్లెలూయా........హల్లెలూయా

ఎల్‌ ఓలామ్‌ (2)

అల్పా ఓమెగయూ
నిత్యుడైన దేవుడవు (2)
నిత్యనిబంధన చేశావు
నిబంధననె స్థిరపరిచావు
నిన్నానేడు రేపు 
మారని దేవుడవు నీవు(2)

ఎల్‌ షద్దాయ్‌ (2)

పోషించు దేవుడవు
ఆశ్రయ దుర్గము నీవు (2)
రెక్కలపై మోసెడి వాడా
రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచె దేవా
మాటను నెరవేర్చేదేవా (2)

అడోనాయ్‌ (2)

ప్రభువైన దేవుడవు
ప్రభువులకు ప్రభువు నీవు (2)
సర్వాధికారివి నీవు
సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు
నీవేనా యజమానుడవు (2)

Sthuthiyu Mahima Ghantha Neeke

స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా (2)

మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభ దినము (2)
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2)

నీవొక్కడవే గొప్ప దేవుడవు
ఘనకార్యములు చేయుదువు (2)
నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2)
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2)

నీవే మాకు పరమ ప్రభుడవై
నీ చిత్తము నెరవేర్చితివి (2)
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2)
నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2)

భరియించితివి శ్రమలు నిందలు
ఓర్చితివన్ని మా కొరకు (2)
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2)
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2)