రండి స్తుతించుచు పాడుడి రారాజు యేఘుని చేరుడి హల్లేలూయ హల్లేలూయ - హల్లేలూయ హల్లేలూయ ఆమేన్ ఆమేన్ - ఆమేన్ ఆమేన్
1. శ్రీ యేసు కాంతిలో నిలిచి సాగించు జీవితయాత్ర బాధలన్నిటిని బాపున్ - భజియించు యేసుని నామం
2.విలువైన నీ జీవితమున్ - వెలిగించు ప్రభు కొరకు - పరిశుద్ధాత్మను పొంది -ప్రభు వాక్కును ప్రచురించు
3.మరణము జయించి లేచెన్ - మరణము ముల్లును విరచేన మధురము యేసుని నామం - మరువకు యేసుని ధ్యానం
ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||